దామెర, ఏప్రిల్ 18 (ప్రజాజ్యోతి):
టూవీలర్ ను తప్పించబోయి ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు భారీ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఏటూరునాగారం నుండి హనుమకొండ కు వస్తున్న ఎల్వక్ట్రిక్ బస్సు హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ శివారులో జాతీయ రహదారిపై డిస్నీ ల్యాండ్ స్కూల్ ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న టూ వీలర్ ను తప్పించబోగా బస్సు రోడ్డు కిందకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరుగలేదు. వరంగల్ – 2 డిపో మేనేజర్ వి. జ్యోత్స్న, ఎలక్ట్రిక్ బస్సు టెక్నీషియన్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థిని పరిశీలిస్తున్నారు.