ఐపీఎల్‌లో ఎన్ని సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచులు జ‌రిగాయో తెలుసా..?

V. Sai Krishna Reddy
2 Min Read

బుధ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)తో జ‌రిగిన సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 18 సీజ‌న్ల‌లో ఇప్ప‌‌టివ‌ర‌కూ 15సార్లు సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచులు జ‌రిగాయి.

2009లో తొలిసారి రాజ‌స్థాన్‌, కోల్‌క‌తా మ్యాచ్ టై కాగా… సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్థాన్ గెలిచింది. ఇక నిన్న‌టి మ్యాచ్‌కు ముందు 2021లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ జ‌రిగింది. ఇందులో కూడా డీసీనే గెలిచింది. మ‌ళ్లీ మూడేళ్ల త‌ర్వాత ఓ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కూ వెళ్లి ఐపీఎల్ అభిమానుల‌కు మ‌జా అందించింది.

ఇక ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుగా డీసీ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) మూడుసార్లు సూపర్ ఓవర్లలో గెలిచింది. ఇక డీసీ, పీబీకేఎస్‌ తర్వాత ఎంఐ, ఆర్ఆర్‌, ఆర్‌సీబీ జట్లు తలా రెండుసార్లు సూపర్ ఓవర్లలో విక్టరీని న‌మోదు చేశాయి.

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన 15 సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచులివే..

1. రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ – ఏప్రిల్ 23, 2009, కేప్ టౌన్

2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వ‌ర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ – మార్చి 12, 2010, చెన్నై

3. సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఏప్రిల్ 7, 2013, హైదరాబాద్

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ – ఏప్రిల్ 16, 2013, బెంగళూరు

5. రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ – ఏప్రిల్ 29, 2014, అబుదాబి

6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వ‌ర్సెస్ రాజస్థాన్ రాయల్స్ – ఏప్రిల్ 21, 2015, అహ్మదాబాద్

7. ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్ గుజరాత్ లయన్స్ – ఏప్రిల్ 29, 2017, రాజ్‌కోట్

8. ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ – ఏప్రిల్ 30, 2019, ఢిల్లీ

9. ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – మే 2, 2019, ముంబై

10. కింగ్స్ ఎలెవ‌న్‌ పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ – సెప్టెంబర్ 20, 2020, దుబాయ్

11. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ – సెప్టెంబర్ 28, 2020, దుబాయ్

12. కోల్‌కతా నైట్ రైడర్స్ వ‌ర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – అక్టోబర్ 18, 2020 , అబుదాబి

13. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ – అక్టోబర్ 18, 2020, దుబాయ్

14. సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ – ఏప్రిల్ 25, 2021, చెన్నై

15. ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్ రాజస్థాన్ రాయల్స్ – ఏప్రిల్ 16, 2025, ఢిల్లీ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *