ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

-బాలికను మోసం చేసిన యువకుడు, కుటుంబ సభ్యులు పరార్..
-యువతి మృతదేహాన్ని యువకుడు ఇంటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు రోడ్డు పై బైఠాయింపు
-యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

-హలియ సీఐ జనార్థన్ గౌడ్, నిడమానూరు ఎస్ఐ సురేష్ లు జోక్యం

నిడమనూరు,ఏప్రిల్ 14(ప్రజాజ్యోతి)ఃప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని యువకుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిడమనూరు మండలం బొక్కమంతుల గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం గత కొద్ది రోజులుగా ధర్మారపు మల్లేశ్వరి (30)లకు
కుక్కల జానారెడ్డి (35)లు ప్రేమించుకుంటున్నారు .ఈ విషయం అబ్బాయి కుటుంబానికి తెలియడంతో యువకుడికి కుటుంబ సభ్యులు మరో వివాహం చేశారు. ఈ విషయం తెలిసుకున్న మల్లేశ్వరి జానారెడ్డి ప్రశ్నించగా తల్లిదండ్రులు చనిపోతామని బెదిరించడంతో తప్పక వివాహం చేసుకున్నాను అని చెప్పడంతొ ప్రేమించిన మల్లేశ్వరి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది . మల్లేశ్వరి చనిపోయిన విషయం తెలియడంతో జానారెడ్డి,కుటుంబ సభ్యులు కలిసి ఇంటిని వదిలి తప్పించుకున్నారు.విషయం తెలుసుకొని యువతి మృతదేహాన్ని కుక్కల జాన్ రెడ్డి ఇంటి ముందు ఉంచి మృతురాలి బంధువులు, స్నేహితులు ,తల్లిదండ్రులు ఇంటి ముందు బైఠాయించారు.విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుని…. ఈ సమయంలో ఇలా చేయడం సరికాదని పోలీసులు నచ్చ చెప్పినా కాని వారు పట్టించుకోకపోవడంతో పాటు మృతదేహాన్ని కుక్కల జానారెడ్డి నివాసంలో ఉంచి బంధువులు గ్రామపెద్దలు భారీ ఎత్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కోదాడ -జడ్చర్ల ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.మృతురాలి బంధువులు రాస్తారోకో చేయడంతో సుమారు రెండున్నర గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు పేర్కొన్నారు.సంఘటన స్థలానికి హలియ సీఐ జనార్థన్ గౌడ్,నిడమనూరు ఎస్ఐ సురేష్ లు చేరుకుని మల్లేశ్వరి బంధువులకు నచ్చే చెప్పేవిధంగా ప్రయత్నం చేస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *