ఖమ్మం ప్రతినిధి ప్రజా జ్యోతి
గత పుష్కరకాలంగా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థలు భక్తులు దాహార్తిని తీర్చడం కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ రామభక్తులకు సేవ చేయడం సాక్షాత్తు శ్రీరాముడికి సేవ చేయడం గానే మేమందరం భావిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తుల కోసం భద్రాచలం బస్టాండ్లో డిపో ఆర్ఎంఓ సరిరామ్ చేతుల మీదుగా ప్రారంభించిన మజ్జిగ, మంచినీటి ప్యాకెట్ల వితరణ కేంద్రం ద్వారా అలాగే రామాలయం దగ్గరలో ప్రారంభించబడిన కేంద్రంలోనూ మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు వితరణ జరిగింది.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 50 వేల మజ్జిగ ప్యాకెట్లు, 50 వేల మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉడత భక్తిగా భక్తులకు సేవ చేసుకోవడం ఆ శ్రీరామచంద్రుడు తమకు ఇచ్చిన ఓ చిరు అవకాశం గా భావిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ ,త్రివేణి పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, బాబురావు ,శ్రీకాంత్ ,నరేష్ మరియు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొని శ్రీరాముని సేవలో తరించారు.
*రామ భక్తుల సేవలో త్రివేణి*

Leave a Comment