హార్ట్ ఎటాక్” ఒకప్పుడు వయస్సు మళ్లిన వారికే ఎక్కువగా వచ్చేది..కానీ ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా..పిల్లల నుంచి పెద్దల వరకు హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ పడిపోవడం, పెళ్లి భరత్‌లో డ్యాన్స్‌లు చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు వదలడం వంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అప్పటి వరకు అందరితో సరదాగా నవ్వుతూ గడిపిన వారు క్షణాల్లో నేల కూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో ఉన్న సీఎంఆర్ కాలేజ్‌లో చోటుచేసుకుంది. సీఎంఆర్ కాలేజ్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్ క్రికెట్ ఆడుతూ గుండెఖమ్మం జిల్లాకు చెందిన వినయ్.. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే క్రికెట్ ఆడుదామని శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి కాలేజీ గ్రౌండ్‌కు వెళ్లారు. అందరూ కలిసి సంతోషంగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అయితే గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వినయ్.. ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే గ్రౌండ్‌లో ఉన్న స్నేహితులంతా వినయ్ దగ్గరకు వచ్చారు. వినయ్‌కు సీపీఆర్ చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. వినయ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వినయ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. అప్పటిదాకా సరదాగా తమతో కిక్రెట్ ఆడిన ఫ్రెండ్ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. క్రికెట్ ఆడుదామని వచ్చి..స్నేహితుడి చావు చూడాల్సి వచ్చిందేనని ఆవేదన వ్యక్తం చేశారు పోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.