వివాహిత అదృశ్యం..
నిడమనూరు,మార్చి 30,(ప్రజాజ్యోతి): ఉగాది పండుగ కోసం పుట్టింటికి వచ్చిన వివాహిత అదృశ్యమైన సంఘటన నిడమానూరు మండలంలోని గుంటికగూడెం లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం అమ్మగూడెం గ్రామానికి చెందిన కొండ శ్రావణి (22) ఉగాది పండుగ కోసం మండలంలోని గుంటుక గూడెంలోని పుట్టింటికి శనివారం వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కూరపాటి వెంకన్న చుట్టుపక్కల,బంధువుల ఇండ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం శ్రావణి తండ్రి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.శ్రావణి సుమారు 5.4 ఫీట్ ఎత్తు, బక్కపలుచగా, చామనచాయా రంగు ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్ రావు తెలిపారు.
.
వివాహిత అదృశ్యం

Leave a Comment