అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అనేక దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ప్రవేశపెట్టిన వాటిలో కీలకమైనది ‘గోల్డ్ కార్డు
5 మిలియన్ డాలర్లు ఉంటే చాలు.. మీరు అమెరికా గోల్డ్ కార్డు జారీ చేసేలా ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇది పెట్టుబడిదారులను ఉద్దేశించి తీసుకొచ్చినది. దీనికోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చేసి ‘గోల్డ్ కార్డ్’ వీసాలను తీసుకొచ్చారు. ఈ వీసాలతో మరో గొప్ప మేలు ఏమంటే.. పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందే మార్గం సుగమం కావడం.
ట్రంప్ చెప్పడమే ఆలస్యం.. ఆపై రెండు వారాల్లో ఈబీ-5 వీసాలను ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’లతో భర్తీ చేశారు. గోల్డ్ కార్డు అంటే ఏమిటో కాదు.. శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ వంటిదే. ఈబీ-5 ప్రోగ్రామ్ కారణంగా జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తెచ్చారు. తద్వారా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడం సులువవనుంది. గత నెలలో ట్రంప్ ప్రకటించిన తర్వాత చూస్తే ‘గోల్డ్ కార్డు’కు భారీ గిరాకీ కనిపిస్తోంది. ఒక్క రోజే వెయ్యి కార్డులను అమ్మడమే దీనికి నిదర్శనం.
5 మిలియన్ డాలర్లకు ఒక కార్డు కావడంతో 1000 గోల్డ్ కార్డుల ద్వారా 5 బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాకు సమకూరాయి. వీరే కాదు.. ఇంకా లక్షలాది మంది గోల్డ్ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారట.