ఆత్మకూరు/ప్రజాజ్యోతి:
తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకునే అవకాశం ఆర్టీసీ కల్పించినట్లు డిపో మేనేజర్ వి.జ్యోత్స్న, ఏ.ఎం.టీ ఎన్.జ్యోత్స్న, ఆర్టిసి ఆత్మకూరు ప్రతినిధి కేడల వేణు శుక్రవారం తెలిపారు. స్వామి వారి తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 9866254690 నెంబర్ లో సంప్రదించి 151రూపాయలు చెల్లించి రసీదు పొందాలని కోరారు. కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.