స్టేషన్ ఘనపూర్, మార్చి 20, ప్రజాజ్యోతి:
ఏసిబి కి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్..
స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ చిల్పూర్ మండలం వెంకటేశ్వర పల్లె గ్రామానికి చెందిన ఇంటి రిజిస్ట్రేషన్ కు (పార్టీషిపేషన్) సంభందించి 20 వేలు డబ్బులు డిమాండ్ చేసి గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్ చేయించుకొనే వారిని డాక్యుమెంట్ రైటర్ ను ఇబ్బందులకు గురి చెయ్యగా వారు విసిగి వేసారి ఏసీబీ వారిని ఆశ్రయించారు. గురువారం బాధితుల నుండి పర్వతం రామకృష్ణ డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడ్డాడు.