భద్రాద్రి లోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే రామయ్య పెండ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆగమశాస్త్రం ప్రకారం జగత్కల్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రి లోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తాము ఎంతో భక్తితో గోటితో ఒలిచిన బియ్యాన్ని శిరస్సు పై ధరించి, గిరిప్రదక్షిణ గావించి తలంబ్రాలలో కలిపారు. చాలా మంది భక్తులు హోలీ పూర్ణిమ నాడు రామయ్యను పెండ్లి కుమారునిగా చేస్తారాని భావిస్తారు. స్వామివారి తలంబ్రాల తయారీ కోసం తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం గులాల్ కలిపారు. కుంకుమ, పసుపు, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను జోడిస్తారు. బేడా మండపం వద్ద స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం చేశారు. పలువురు భక్తులు గోటి తలంబ్రాలను అందించారు. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.