వచ్చే ఏడాది దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమేనా? అదే జరిగితే.. జనాభా ప్రాతిపదికనా? పాత లెక్కల ప్రకారమా? కేంద్రం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. డీలిమిటేషన్ ప్రయత్నాలతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అంతేకాదూ.. దండయాత్రకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వచ్చే ఏడాది దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమేనా? అదే జరిగితే.. జనాభా ప్రాతిపదికనా? పాత లెక్కల ప్రకారమా? కేంద్రం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అంతేకాదూ.. దండయాత్రకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమకు తగిన నిధులు కేటాయించడం లేదని కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో డీలిమిటేషన్ ప్రయత్నాలతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
డీలిమిటేషన్‌పై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిసైడైంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా అన్ని పార్టీలు హాజరుకావాలంటూ బహిరంగ లేఖ రాశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డీలిమిటేషన్‌తో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై అన్ని పార్టీలతో చర్చించి.. సమావేశం వేదికగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్.