ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 12 ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న 1532 మంది ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారని అన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణను, ఇక్కడి విద్యార్థులను దేశంలో ముందుంచేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు