ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన కొనసాగుతోంది. మోదీకి మారిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని, మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. మారిషస్ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ సందేశం ఇచ్చారు. ఇది నా ఒక్కడికి లభించిన పురస్కారంగా భావించడంలేదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
కాగా, మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ లో మోదీకి నిన్న ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులామ్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి భారత ప్రధానికి స్వాగతం పలకడం విశేషం.