దామెర, మార్చి 8 (ప్రజాజ్యోతి):
డిస్నీల్యాండ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం..
డిస్నీల్యాండ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ ఇ-టెక్నో ఉన్నత పాఠశాలలో ఎంతో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కరస్పాండెంట్ శ్రీమతి బాలుగు శోభారాణి మాట్లాడుతూ.. పూర్వకాలంలో మహిళలు ఇంటి గడప దాటి బయటకు వచ్చే వారు కాదని, చదువులో వెనుకబడి ఉండేవారని కానీ ప్రస్తుత తరుణంలో స్త్రీలు బాగా చదువుకొని విద్యా, వైద్య, వైమానిక, రక్షణ, శాస్త్ర,సాంకేతిక మరియు క్రీడా రంగాలతో పాటు అనేక రంగాలలో ముందున్నారని, రాణి రుద్రమ దేవి పాలించిన నేలపై మనం జన్మించడం మన అదృష్టమని, మహిళ అబల కాదు సబల అని నేటి బాలికలు ధైర్యంగా ఆత్మ స్థైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 20 మంది ఉపాధ్యాయునిలు, 260 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు తోటి విద్యార్థినులను రంజింప చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు దయ్యాల రాకేష్ భాను, దయ్యాల దినేష్ చందర్ గార్లు పాల్గొన్నారు.