సంగెం (గీసుగొండ),మార్చి07(ప్రజాజ్యోతి):
గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న రగడ…
-కాంగ్రెస్ పార్టీ నుండి వీరగొని రాజుకుమార్ అల్లం మార్రెడ్డీ ని సస్పెండ్ చేసిన మండల అధ్యక్షులు శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గీసుగొండ మండల నాయకులు విరగోని రాజుకమార్,అల్లం మార్రెడ్డి ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసామని మండల అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..వీరిద్దరూ టిఆర్ఎస్ బిజెపిలతో లోపాయకార ఒప్పందం ఏర్పరచుకొని కాంగ్రెస్ పార్టీని అభాష్పాలు చేస్తున్నారని అన్నారు.ఈ రోజు నుండి రాజుకుమర్ అల్లం మారెడ్డి ఇద్దరికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గీసుకొండ మండల సమన్వయ సమితి నిర్ణయం మేరకు ఇరువురిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కోమురారెడ్డి మాజీ ఎంపీపీ బీమాగాని సౌజన్య దూలం వెంకటేశ్వర్లు మాజీ ఎంపిటిసి మని గోపాల్,కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి పొగాకు రవీందర్,కూసం రమేష్,సాంబరెడ్డి,మార్కెట్ డైరెక్టర్ అకుల రుద్ర ప్రసాద్,ఎస్సీ సెల్ గొర్రె రాజు,ఎల్కుర్తి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్ల సురేష్,లాడె రాజు,తిరుపతి,రమేష్,భాస్కర్,అశోక్ కుమార్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు