ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

V. Sai Krishna Reddy
1 Min Read

సైబర్ నేరస్థులు ఏకంగా ఓ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో వీడియోను కార్యకర్తలకు పంపించారు. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే ఓ అమ్మాయి న్యూడ్ గా కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశారు. అప్పటికే వీడియో రికార్డ్ చేసిన దుండగులు.. ఆ క్లిప్ ను ఎమ్మెల్యేకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు.

ఈ హెచ్చరికలను ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టించుకోలేదు. దీంతో సైబర్ నేరస్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులకు ఆ వీడియో క్లిప్ ను పంపించారు. కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో అవాక్కయిన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *