బీఎస్ఎన్ఎల్ నుంచి హోలీ ధమాకా ప్లాన్… వివరాలు ఇవిగో

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూకుడు పెంచింది. ప్రైవేటు టెలికాం సంస్థలకు దీటుగా వినియోగదారులకు సరసమైన ధరలతో సేవలను అందించడానికి ముందుకు వస్తోంది. ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగ రానున్న నేపథ్యంలో వినియోగదారుల కోసం హోలీ ధమాకా ప్లాన్‌ను ప్రకటించింది.

బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్‌ రూ.2,399 ప్లాన్‌కు వర్తిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని 395 రోజుల నుంచి 425 రోజులకు పెంచింది. అంటే ఈ రీచార్జి ప్లాన్ ద్వారా నెల రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తుందన్న మాట. ఈ మేరకు హోలీ ధమాకా ఆఫర్ వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *