బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.