దామెర, మార్చి 01 (ప్రజాజ్యోతి):
ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్ డీ పట్టా పొందిన ‘శంకర జ్యోతి’
హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన జి. సరోజన – ఆదిరెడ్డి దంపతులకు 3వ పుత్రుడు అయిన గట్ల అనిల్ రెడ్డి సతీమణి ‘శంకరజ్యోతి’ కి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్ డీ పట్టా లభించింది. ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ గురుకులం డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న శంకరజ్యోతికి గణితంలో ”ఏ స్టడీ ఆన్ రెగ్యులర్ డామినేషన్ ఇన్ లిటాక్ట్ గ్రాఫిక్స్” అనే అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి పట్టా లభించింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో తన విద్యను అభ్యసించినారు. గణితంలో ఇబ్బందులు పడే వారికి సులభంగా అర్ధమయ్యే విధముగా ఉండేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పిహెచ్ డీ పూర్తి చేసినట్లు శంకరజ్యోతి తెలిపారు. తనకి సహాయ సహకారాలు అందించిన ఉస్మానియా యూనివర్సిటీ గణిత విభాగంలోని ప్రొఫెసర్స్, అలాగే అమ్మ, నాన్న పద్మావతి సోమిరెడ్డి మరియు కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.