ఆత్మకూరు, మర్చి 01 (ప్రజాజ్యోతి)
రెడ్డి సంఘం అధ్యక్షునిగా ‘వంగాల భగవాన్ రెడ్డి’
ఆత్మకూరు రెడ్డి రైతు సహకార సంఘం అధ్యక్షునిగా వంగాల భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కట్కూరి విజేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో భగవాన్ రెడ్డి గెలుపొందాడు. ప్రధాన కార్యదర్శి బరిలో ఎవ్వరు లేకపోవటంతో విజేందర్ రెడ్డి యునాన్మాస్ గా ఎన్నికయ్యాడు. ఈ మేరకు శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం మందల ప్రతాప్ రెడ్డి ఇంటి ఆవరణలో నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు వంగాల బుచ్చి రెడ్డి, రేవూరి సంపత్ రెడ్డి, రేవూరి ప్రభాకర్ రెడ్డి, మరియు ఎన్నికల కమిటీ సభ్యులు లేతాకుల సంజీవ రెడ్డి, రేవూరి సుధాకర్ రెడ్డి, జిన్న రామకృష్ణ రెడ్డి, రేవూరి జయపాల్ రెడ్డి, అండ్రు విశ్వశ్వర్ రెడ్డి, అడ్వకాట్ పిపి రాజమల్లా రెడ్డి తదితరులు నూతన అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం అకౌంట్స్, తీర్మానం బుక్స్ నూతన సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు భగవాన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో సంఘం అభివృద్ధిపై దృష్టి సారించి రైతులకు తోడ్పాటు అందిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకుపోతానని హామీ ఇచ్చారు. రెడ్డి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. రైతులకు ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ పనిముట్లు తదితర అందే విధంగా వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడి రైతులకు సహాయం అదే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ రెడ్డి రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.