వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 28, (ప్రజాజ్యోతి):
వరంగల్ వాసులకు దశాబ్ద కాలం కోరిక నేరవేరింది..
మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మంత్రి కొండా సురేఖ వెల్లడి..
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నేరవేరిందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది తమ సీఎం రేవoతన్న, ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా వాసులు గాల్లో తేలే వార్త ఇది అని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఎళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. మమునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై తీవ్రంగా చేసినట్టు చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని అతి త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె వెల్లడించారు. ఈక్రమంలోనే.. మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించిన భూసేకరణ విషయంలో తమ ప్రాంత ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సహకారం అందించాలని చెప్పారు. మామునూరు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని కొనియాడారు. జిల్లా మంత్రిగా తాను జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి.. మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన పలుమార్లు చేసినట్టు చెప్పారు. ఆ సందర్భంలో… గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో మంత్రి హోదాలో సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావల్సిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో సంప్రదింపులు జరిపినట్టు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ జిల్లా మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.