ఏపీలో ఇంటర్ పరీక్షలకు తెర లేస్తోంది. రేపు (మార్చి 1) ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు… మార్చి 3 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 20 ఎగ్జామ్ సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. కాగా, విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు.
కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,00,963 మంది జనరల్ విద్యార్థులు… 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,71,021 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు.