ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సీఎస్‌కే ఎక్స్ వేదికగా సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇంతకు ముందు సీఎస్‌కేకి అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన బ్రావో .. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కి మెంటర్‌గా చేరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నూతన నియామకాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతాలో సీఎస్‌కే ప్రకటించింది. మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీరామ్ శ్రీధరన్‌కు సెల్యూట్ అని పేర్కొంటూ, చెపాక్ పిచ్ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లకు చాలా ఏళ్లుగా కోచ్‌గా పని చేసిన శ్రీధరన్ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడని పేర్కొంది.