ఎల్లుండితో మహా కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో, ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంపై విమర్శలు చేస్తున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. కుంభమేళాపై అవాకులు, చెవాకులు పేలేవారు పందులు, రాబందులు అంటూ ధ్వజమెత్తారు.
సున్నిత మనస్కులైన ప్రజలకు అందమైన అనుబంధం ఆవిష్కృతమైంది… వర్తకులకు మంచి వ్యాపారం లభించింది… భక్తులు పరిశుభ్రమైన ఏర్పాట్లు పొందారు… రాబందులకు శవాలు లభించాయి… పందులు బురదలో పొర్లాయి… అంటూ విపక్షాలను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేశారు.
మీరు (విపక్షాలు) కుంభమేళాకు ఓ కులాన్ని అనుమతించడంలేదని అంటున్నారు. ప్రత్యేకించి ఏ కులాన్ని కుంభమేళాకు వెళ్లకుండా అడ్డుకోలేదు. సదుద్దేశంతో కూడిన ఎవరైనా సరే కుంభమేళాకు గౌరవంగా వెళ్లొచ్చు. కానీ కుంభమేళాలో చిక్కులు సృష్టించాలన్న దురుద్దేశంతో వెళ్లేవారికి మాత్రం ఇక్కట్లు తప్పవు.