ఆత్మకూరు, ఫిబ్రవరి 24 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. సోమవారం 62కిలోల ఎండు గంజాయి అక్రమంగా ఒడిషా నుండి సూరత్ కు తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్ల ను అరెస్ట్ చేసిన ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 31లక్షల విలువైన సుమారు 62కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ముగ్గురు ఒడిషా రాష్ట్రనికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మరో నిందితుడు పరారీ లో ఉన్నట్లు ఆత్మకూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్ వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఒరిస్సా కు చెందిన కాన్షు జానూ, అలోక్ ప్రధన్, మంగు ప్రధన్ ఉన్నారు.