కాంగ్రెస్ కుట్రలో మోస పోయాను.
…నరేందర్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పని చేస్తాను.
…మాజీ డిఎస్పీ మదనం గంగాధర్
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
కాంగ్రెస్ పన్నిన కుట్రలో మోసపోయానని, కాంగ్రెస్ ప్రభుత్వం తనను మోసం చేసిందని మాజీ డిఎస్పీ మదనం గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిఎస్పీ మదనం గంగాధర్ మాట్లాడుతూ..ఒక్కనిగా వచ్చి నా జీవిత నేపథ్యాన్ని, కుటుంబ నేపథ్యాన్ని చూపెట్టి మీ అందరీ ముందు మీ అందరి ఆదరాభిమానాలను గెలుచుకోవాలని అనుకున్న కానీ ఇలా కుట్రలో బలి అవుతానని అనుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. భయపడి, వెనక్కి తగ్గి వ్యక్తిని కాదని కానీ నాపై అభిమానం పెంచుకొని, ఆదరణ చూపిన జనాలను చూస్తుంటే భాద అనిపిస్తుందన్నారు. సంచార జీవితం గడిపిన నాకు కుటుంబంలో ధైర్యమే కనిపించింది తప్ప, భయం ఎక్కడ లేదని అన్నారు. ఐదు నెలల పాటు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళానని. నన్ను అభిమానించిన ప్రతి ఒక్క మేధావికి, సమాజంలోని నిరుద్యోగులకు, పట్టభద్రులు క్షమించాలని కోరారు. ఇండిపెండెంట్ గా దూసుకు పోతున్న నాకు పట్టభద్రుల డిమాండ్ కోసం కాంగ్రెస్ పార్టీ తో కలిస్తే మేనిఫెస్టో సులువు అవుతుందని అనుకోవడం జరిగిందని, ముఖ్య మంత్రి పిలిచినప్పుడు, ఒక వ్యవస్థలో పని చేసిన వ్యక్తిగా నేను వెళ్ళానని మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నా ప్రమేయం లేకుండానే పార్టీ కండువా కప్పి, సోషల్ మీడియాలో కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం చేయడంతో అవాక్కయ్యనని, నాకు ఫోన్ ద్వారా మేసేజ్ వచ్చింది చూసుకుని షొక్ కు గురయ్యానని అన్నారు. అనంతరం మేలుకొని నాతో పాటు ఉన్న మిత్రులతో చర్చించగా కాంగ్రెస్ లో మేనిఫెస్టో ను అమలు చేస్తామని ముఖ్య మంత్రి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టీ నన్ను పరిచయం చేసి పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో సరే నని ఒప్పుకున్నామన్నారు. విత్ డ్రా చేసుకొని రావాలని సూచించడంతో విత్ డ్రా చేసుకున్న తర్వాత ఫోన్లో సంప్రదిస్తే ఎలాంటి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టించుకోకపోవడం కలచి వేసిందన్నారు. మోస పోయానని తెలుసుకున్నామని, నాకు ఓటు వేద్దామని అనుకున్న వారికి దీంతో న్యాయం జరుగుతుందని అనుకున్నామని కానీ అందుకు విరుద్ధంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. నా అనుమతి లేకుండానే నా సమ్మతి లేకుండానే పార్టీ కండువా కప్పడం జరిగిందన్నారు. నాకు ఓటు వేయాలని అనుకున్నారో వారిని క్షమించమని అడుగున్నమన్నారు. నన్ను వంచించిన వారికి ఓటు వేయొద్దన్ని నిర్ణయం తీసుకున్నామని, అర్హులకు ఓటు వేయాలని అనుకుంటున్నామన్నారు.భారతీయ కార్మిక సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షులు
గొల్ల వల్లి దయానంద్ రావు
మాట్లాడుతూ సంచార జీవితంతో ప్రారంభించి సంచలనం సృష్టించేలా ప్రచారం చేసిన మదనం గంగాధర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా మోసం చేయడం సరికాదన్నారు.
ఇంటెలిజెన్స్ తో ద్వారా సమాచారం తెలుసుకొని పిలిపించి నమ్మక ద్రోహం చేశారని అన్నారు.సారీ గంగాధర్ అంటూ కండువా కప్పి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో వాట్సాప్ లలో పంపించడం జరిగిందని, నిన్ను పార్టీ గుర్తించింది, మంచి స్థానం ఉంటుందని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారని, విత్ డ్రా చేసినాక ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. అభ్యర్థి నరేందర్ రెడ్డి తనకు ఏమి తెలియనట్టు మాట్లాడారని అన్నారు.
మాదిగ సంఘాల మహా కూటమి చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సంచార జీవితం నుంచి మొదలు కొని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గంగాధర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుట్ర పూరితంగా మోసం చేయడం సరికాదని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుస్తాడని, నరేందర్ రెడ్డి కి అడ్డుగా ఉన్నాడని ఆలోచించి కుట్రతో విత్ డ్రా చేయించారన్నారు.అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని జలగల్ల పీల్చుకున్న నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం సరి కాదని ఆరోపించారు.