మేడ్చల్ జిల్లాలో కన్న కొడుకే తండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన 45 ఏళ్ల మొగిలిని అతని తనయుడు సాయికుమార్ హత్య చేశాడు. తండ్రీకొడుకులు ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో కొడుకు హత్య చేసినట్లు చెప్పారు.
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుండి మొగిలి బస్సులో బయలుదేరగా, కొడుకు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ స్టాండ్ వద్దకు రాగానే తండ్రి మొగిలి బస్సు దిగాడు. వెంట తెచ్చుకున్న చాకుతో పది పదిహేనుసార్లు విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెండాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు