పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని సన్మానించిన వెల్నెస్ హాస్పిటల్స్ బృందం
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ : ఈరోజు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ మరియు జనరల్ మేనేజర్ ఎం.రాజేష్, వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ లో 6 బ్రాంచులు ఉండగా కొత్తగా నిజామాబాద్ లో బ్రాంచ్ ఏర్పాటుచేయబోతున్న సందర్బంగా వారిని మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇలాగే ప్రజలకు ముందు ముందు తక్కువ ఖర్చుతో మంచి సేవలు అందించాలని కోరారు .
మేనేజింగ్ డైరెక్టర్స్ తాళ్ల సుమన్ గౌడ్ ,అసద్ ఖాన్ మరియు వివేకనంద రెడ్డి లను మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు .