270 కిలోల రాడ్డు మీదపడి మహిళా వెయిట్ లిఫ్టర్ మృతి

V. Sai Krishna Reddy
0 Min Read

ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు మెడ మీద పడటంతో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి చెందింది. 17 ఏళ్ల ఆచార్య జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాడ్డు మీద పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆచార్య గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకుకుంది. ఈ ఘటనలో శిక్షకుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *