నిజామాబాద్ నగరంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
ప్రజాజ్యోతి నిజామాబాద్ క్రైమ్
నిజామాబాద్ నగరంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. గోల్ హనుమాన్ చౌరస్తా నుంచి కసబ్ గల్లీ, పెద్దబజార్, గాజుల్ పేట్, బాసింగ్ బాబా ఆలయం మీదుగా హైమద్ బజార్, నెహ్రూ పార్క్ వరకు ఈ కవాతు సాగింది. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస రాజు, టూటౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.