శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఆదివారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన దూలం రమేష్ కుటుంబ సభ్యులను బోనెపల్లి రఘుపతి రెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేసి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వైద్యుల ఆది రెడ్డి, మోరే రాజయ్య, గంగిడి సుధాకర్ రెడ్డి, మోరే శ్రీను, పోలేపల్లి అశోక్, కూరాకుల రాజు, కురాకుల సంతోష్, బత్తిని కుమారస్వామి, భయగాని రాజు, మూలగుండ్ల సందీప్ రెడ్డి, సామంతుల సురేష్, కోసారి కట్టయ్య, భయగాని సాంబయ్య, గోగుల రాజిరెడ్డి, మాదం కుమారస్వామి, చిలకల రవి, భయగాని విక్రం, భయగాని శరత్, మాదారి అభిలాష మాదారపు కిరణ్, మాదారపు సారయ్య, మాదారపు రవి, మాదారపు చిరంజీవి పాల్గొన్నారు.