దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు
విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుక కనిపించడం కలకలం రేపింది. ప్రసాదంలో నాణ్యత లేదని ఓ భక్తుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్ పెట్టాడు. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డూలోనూ వెంట్రుకలు ఉండటంతో తాను నిర్ఘాంతపోయినట్లు అతడు మంత్రి ఆనంను ట్యాగ్ చేశారు. స్పందించిన మంత్రి భక్తుడికి క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే ఆలయాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు.