భూ వివాదానికి సంబంధించి హైదరాబాద్ టోలిచౌకీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. గోల్కొండకు చెందిన షకీల్ శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి బాలకృష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు వినిపించాయన్న సమాచారంతో అక్తర్ వద్ద ఉన్న లైసెన్సు గల తుపాకీని పోలీసులు తనిఖీ చేశారు. కాల్పులు జరిపినట్లు ఎలాంటి అధారాలు లభించలేదని పోలీస్ అధికారి బాలకృష్ణ తెలిపారు. అయితే ఇరువర్గాల్లో ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.
జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, దీనిని సుమోటోగా తీసుకుని ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో జరిగి