ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటం వృథా అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన గురించి మాట్లాడేంత సమయం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, ఆయనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు పంపించినట్లు తాను వార్తా పత్రికలలో చూసి తెలుసుకున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు.