Rating: 2.75/5 నటీనటులు: అజిత్, త్రిషా కృష్ణన్, అర్జున్, రెజీనా కసండ్రా, రమ్య సుబ్రమణ్యన్, ఆరవ్, సంధ్య జనక్ తదితరులు దర్శకత్వం: మగిజ్ తిరుమెని నిర్మాత: సుభాస్కరన్ అలిరాజా సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్ ఎడిటింగ్: ఎన్ బీ శ్రీకాంత్ మ్యూజిక్: అనిరుధ్ రవి. చందర్ బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ అర్జున్ (అజిత్), కాయల్ (త్రిషా కృష్ణన్) భార్యభర్తలు. 12 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఆస్వాదించిన తర్వాత అర్జున్ నుంచి త్రిషా విడాకులు తీసుకోవాలని అనుకొంటుంది. భార్య నిర్ణయాన్ని అర్జున్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదిస్తాడు. అయితే కోర్టు నుంచి విడాకులు వచ్చే వరకు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని చెబుతుంది. దాంతో చివరిసారిగా కలిసి ప్రయాణిద్దామని కాయల్ ఇంటికి బయలు దేరుతారు. జర్నీ మధ్యలో రక్షిత్, దీపిక (అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా) గ్రూప్ కాయల్‌ను కిడ్నాప్ చేస్తుంది.
అజిత్, కాయల్ పెళ్లికి ముందు ఎలా పరిచయం అయ్యారు? వారి లవ్ జర్నీ ఎలా సాగింది? 12 ఏళ్ల తర్వాత అర్జున్ నుంచి ఎందుకు కాయల్ విడాకులు తీసుకోవాలనుకొన్నది? అర్జున్, కాయల్ ప్రయాణించే చివరి జర్నీలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? కాయల్‌ను అర్జున్ బ్యాచ్ ఎందుకు కిడ్నాప్ చేసింది? భార్య కిడ్నాప్‌కు గురైన తర్వాత అర్జున్ పరిస్థితి ఏమిటి? కాయల్‌ను అర్జున్ ఎలా రక్షించాడు? చివరకు భర్త నుంచి కాయల్ విడాకులు తీసుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే పట్టుదల (విదాముయార్చి) సినిమా కథ.