అయితే.. తుది అంచనాల ప్రకారం.. పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, సాయంత్రం ఐదు తర్వాత కూడా లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మూడు పార్టీలైన ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. మొత్తం 57 శాతం పోలింగ్ జరిగినట్టు సాయంత్రం నాలుగు గంటల సమయానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే.. తుది అంచనాల ప్రకారం.. పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, సాయంత్రం ఐదు తర్వాత కూడా లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించింది.ఇదిలావుంటే.. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఐదు గంటలకు ముగియగానే.. సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. దాదాపు ఆరు సర్వే సంస్థలు ఢిల్లీ పీఠం ఎవరిదనే విషయంపై ఓటర్ల నాడిని తెలుసుకున్నాయి. ఈ ఫలితాల ప్రకారం.. మెజారిటీ సర్వేలు.. బీజేపీకే అనుకూలంగా తీర్పు చెప్పగా.. `కేకే` సర్వే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపాయి. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఏ సర్వే కూడా మొగ్గు చూపకపోవడం గమనార్హం. ఆ పార్టీ అధికారంలోకి రావడం మాట ఎలా ఉన్నా.. పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం కష్టమేనని సర్వేలు చాటి చెప్పాయి. కాగా… వాస్తవ ఫలితం కోసం ఈ నెల 8వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.
సర్వే ఫలితాలు ఇవీ..
పీపుల్స్ పల్స్- కొడిమో సర్వే: ఢిల్లీలో బీజేపీ పాగా వేస్తుంది. బీజేపీ 51-60, ఆప్ 10-19 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39 నుంచి 44 స్థానాల్లో విజయం దక్కించుకుని అధికారం చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత అధికార పార్టీ ఆమ్ ఆద్మీ కేవలం 25 నుంచి 28 స్థానాలకే పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది.
కేకే సర్వే: ప్రస్తుత అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ గద్దెపై కూర్చోనుంది. ఈ పార్టీకి 39 సీట్లలో విజయం పక్కా. బీజేపీ 22 స్థానాలకు పరిమితం కానుంది.