ఎదురుతిరిగిన కొలంబియా వంటి దేశాలకు ట్రంప్ సుంకాలతో షాకిచ్చి దారిలోకి తెచ్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన్నదైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచదేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సమయంలో కొన్ని దేశాలు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎదురుతిరిగిన కొలంబియా వంటి దేశాలకు ట్రంప్ సుంకాలతో షాకిచ్చి దారిలోకి తెచ్చుకుంటున్నారు.
ఈ విషయంలో మిత్రదేశం, శత్రుదేశం, న్యూట్రల్ దేశం అనే తేడాలు లేకుండా ట్రంప్ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మొదటి నుంచీ కెనడా, మెక్సికో దేశాల పేర్లు ప్రస్థావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కెనడాకు షాకిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అదే స్థాయిలో యూఎస్ కు కెనడా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
అవును… రెండో సారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా.. సుంకాల విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా… కెనడా, మెక్సికోలపై తాను చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు.. ఆ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… కెనడా, మెక్సికోలపై సుంకాలు విధించే ఉత్తర్వ్యులపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ట్రంప్… నేడు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేసినట్లు తెలిపారు.