నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీ రోడ్డు డ్రెయినేజీ నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. శుక్రవారం నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌కు 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.10లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, ఉమారాణి, నాయకులు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.