చేర్యాల ఏప్రిల్ 02(ప్రజాజ్యోతి): చేర్యాల పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని కీర్తన(16) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.వివరాల్లోకి వెళితే..ఆకునూర్ గ్రామానికి చెందిన కీర్తన తన తాత కడుదూరి బాలయ్యతో కలిసి టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తుండగా, పాత బస్టాండ్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ మోటార్ సైకిల్ ని బలంగా టీ కొట్టడంతో ప్రమాదంలో కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.కీర్తన తాత బాలయ్య (70) కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
