ఐదవ తరగతి పిల్లలకు వీడ్కోలు సమావేశం 

Kamareddy
1 Min Read

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం

రామారెడ్డి ఫిబ్రవరి 01 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండలంలోని పోసానిపెట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఐదవ తరగతి పిల్లలకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ మొబులైజేషన్ లో భాగంగా నూతన గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉపసర్పంచ్ అంజయ్య, నూతన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్, మరియు సభ్యులు పాల్గొని పిల్లల యొక్క సృజత్మాకత, ఆట,మాట,పాట సమగ్ర అభివృద్ధి ని చూసి మురిసిపోయి పిల్లలను,ఉపాధ్యాయులను అభినందించారు. నూతన విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ రావడానికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రధానోపధ్యాయులు జ్యోత్స్న ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు శివకృష్ణ, శ్రీనివాస్, రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *