కామారెడ్డి రూరల్ సిఐ రామన్ బదిలీ
కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 31 (ప్రజాజ్యోతి)
కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ రామన్ ఈ మంగళవారం బదిలీ అయ్యారు. ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయం ప్రకటించిన బదిలీలలో కామారెడ్డి సీఐ కూడా ఉన్నారు. విధులు నిర్వహిస్తున్న సిఐ రామన్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. నూతన సిఐ గా కామారెడ్డికి సిద్దిపేటలోని సీఎస్‌బీలో పనిచేస్తున్న పల్లె శ్రీధర్ గౌడ్,బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు బదిలీపై వెళ్తున్న సీఐ రామన్ రెండు సంవత్సరాల పాటు కామారెడ్డి రూరల్ సిఐగా పనిచేశారు.
