అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం 

Kamareddy
1 Min Read

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం 

రామారెడ్డి మార్చ్ 30 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరిపించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ శివపార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తదుపరి స్వామివారిని ఎదుర్కోలు చేసి, పల్లకి సేవలో ఘనంగా కళ్యాణం కు ఉత్సవ మూర్తులను శాస్రోత్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణతో ఘనంగా సుమారు 100 మంది జంటలతో శివపార్వతుల కన్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనేది లోక కల్యాణం కోసం జరిగిన అత్యంత పవిత్రమైన ఘట్టం. ఈ వేడుకను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.తారకాసురుడు అనే రాక్షసుడిని అంతం చేసే శక్తి కేవలం శివపార్వతుల సంతానానికి మాత్రమే ఉంటుందని దేవతలు గ్రహిస్తారు. లోక రక్షణ కోసం, దక్ష యజ్ఞం తర్వాత వైరాగ్యంలో ఉన్న పరమశివుడిని, హిమవంతుడి పుత్రికగా జన్మించిన పార్వతీ దేవి తన తపస్సుతో మెప్పించి, వివాహానికి ఒప్పిస్తుంది.ఈ వివాహానికి హిమవంతుని రాజధాని వేదికగా మారుతుంది. బ్రహ్మ దేవుడు పురోహితుడిగా, విష్ణుమూర్తి పార్వతీ దేవికి సోదరుడిగా ఉండి కన్యాదానం చేస్తారు.శివుడు చంద్రశేఖరుడిగా, పార్వతీ దేవి సర్వాభరణ భూషితయై పెళ్లిపీటలపై కూర్చుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుశనుల రమేష్, సెక్రెటరీ రాజేందర్, కోశాధికారి సౌడం నవీన్, గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్,సుంకోజి గంగాధర్,బాలేష్,మధుసూదన్, కాసర్ల స్వామి,మహిపాల్,ఎర్రోళ్ల రాజు, ఇతర సభ్యుల తో పాటు పాలకవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, వేద పండితులు పురోహితులు, భారీ ఎత్తున భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *