సంగెం పోలీస్ స్టేషన్‌లో సిపి పర్యటన.. శాంతిభద్రతలపై సిపి ఆరా..!

Warangal Bureau
1 Min Read

సంగెం పోలీస్ స్టేషన్‌లో సిపి పర్యటన.. శాంతిభద్రతలపై సిపి ఆరా..!

-స్టేషన్ డైరీ నుంచి లాకప్ రూమ్ వరకు..సిపి క్షేత్రస్థాయి పరిశీలన.

-​నేర నియంత్రణే లక్ష్యం:పోలీస్ స్టేషన్‌లో సిపి సమీక్ష

-ప్రజలకు అందుబాటులో ఉండాలి: పోలీస్ స్టేషన్ తనిఖీలో సిపి ఆదేశం

సంగెం, మార్చి26 (ప్రజాజ్యోతి):

ప్రజల సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రాథమిక బాధ్యత అని,పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవం దక్కాలని వరంగల్ సీపి సన్ ప్రీత్ సింగ్ సంగెం (SHO) ను ఆదేశించారు. గురువారం రోజున సంగెం పోలీస్ స్టేషన్ కు వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేరుకోగా స్థానిక ఎస్సై వంశీకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మామిడి మొక్క నాటి చుట్టు తిరిగి ఎస్సైని అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాత్రిపూట పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానిత వ్యక్తుల పై నిఘా ఉంచాలని అన్నారు.పెండింగ్‌లో ఉన్న పాత కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మహిళల ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలని,షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. స్టేషన్‌లోని క్రైమ్ రిజిస్టర్లు, లాకప్ రూమ్ ఆయుధాగారాన్ని సీపీ పరిశీలించారు. చార్జ్ షీట్లు దాఖలు చేయడంలో ఆలస్యం కాకూడదని ఆదేశించారు.ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ మాట్లాడుతూ.సీసీటీవీ నెట్‌వర్క్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, నేరగాళ్లను పట్టుకోవడంలో సాంకేతికతను వాడాలని స్పష్టం చేశారు.నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సిఐ రాజగోపాల్, ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *