పోలీసుల నిఘాలో చేర్యాల

-చోరీలకు,గొడవలకు ఇక చెక్! -26 కెమెరాలతో కంట్రోల్ రూమ్ సిద్ధం

Siddipet Bureau
1 Min Read

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యవసరం: సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్
చేర్యాల, మార్చి 26(ప్రజాజ్యోతి): నేరాల నియంత్రణలో మరియు శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు.గురువారం చేర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్లలో పోలీసు యంత్రాంగం మరియు స్థానిక వ్యాపారుల సహకారంతో మొత్తం 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ…చోరీలు, గొడవలు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిందితుల కదలికలను సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి, కేసులను వేగంగా ఛేదించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేరగాళ్లలో భయం పెంపొందించడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఈ ‘నిఘా నేత్రాలు’ ఎంతో దోహదపడతాయని వివరించారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపార,వాణిజ్య సంస్థల సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.కేవలం ప్రధాన కూడళ్లలోనే కాకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్ల ముందు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ ,చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి ,కొమరవెల్లి ఎస్సై తోట మహేష్,మద్దూరు ఎస్ఐ ఆసిఫ్,పోలీస్ సిబ్బందితో పాటు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ , వైస్ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమ, కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *