అక్రమ మట్టి రవాణాపై సంగెం పోలీసుల కొరడా..
సంగెం, మార్చి21 (ప్రజాజ్యోతి):
ప్రభుత్వ భూములు కేనాల్ గట్ల నుండి మట్టిని తరలించాలంటే సంబంధిత శాఖల నుండి ఖచ్చితంగా అనుమతులు ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. శనివారం రోజున మండలంలోని షాపూర్ పరిధిలో ఉన్న కెనాల్ నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. శనివారం రోజున ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో షాపూర్ శివారులలో అక్రమంగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కీ మట్టి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ వంశీకృష్ణ కానిస్టేబుళ్లు శంకర్ కిషోర్ వెళ్లగా అక్కడ తీగరాజుపల్లి గ్రామానికి చెందిన విజేందర్ అలీయాస్ చింటూ ఒక జెసిబి ఒక టిప్పర్ తో మట్టితోడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే పోలీసులు అతనిని అనుమతి పత్రాలు అడగగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవని విజేందర్ చెప్పడంతో డ్రైవర్ ఓనర్ చింటూను అరెస్టు చేసి, జెసిబి టిప్పర్లను పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మట్టి తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీబీలతో మట్టిని మాయం చేస్తే పోలీస్ లాఠీలతో చట్టం తన పని తాను చేస్తుందని జేసిబి ఓనర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
