మల్లన్న–బీరప్ప గుడి అభివృద్ధికి విరాళాలు

Rangareddy Bureau
1 Min Read

చేవెళ్ల మార్చి 02(ప్రజా జ్యోతి):
చేవెళ్ల మండల పరిధిలోని నాంచేరి గ్రామంలో మల్లన్న, బీరప్ప గుడి అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. ఆలయ అభివృద్ధి నిధికి గణనీయమైన విరాళాలు అందజేశారు.

చేవెళ్ల మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు, 12వ వార్డు కౌన్సిలర్ అత్తెల్లి మనిషా అనంత్ రెడ్డి రూ.51 వేల చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. అలాగే చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్ గారి విజయలక్ష్మి రమణారెడ్డి, డా. వైభవ్ రెడ్డి రూ.51 వేల విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను గ్రామస్తులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, దాతలు ఇదే విధంగా అండగా నిలవాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *