సారు జర దేకో తృటిలో తప్పిన ప్రమాదం

Kamareddy
2 Min Read

సారు జర దేకో తృటిలో తప్పిన ప్రమాదం

జర ధేఖో ఎఈ సాబ్

— అయ్యవారిపల్లి సర్పంచ్ కి తృటిలో తప్పిన ప్రాణాపాయం
— ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా
— గ్రామంలో విద్యుత్ సరఫరా పరిష్కరించే క్రమంలో విద్యుత్ ఘాతం
–వ్యవసాయ బావులకు, గ్రామానికి వేరువేరు ట్రాన్స్ఫార్మర్ల 2డిడి ల చెల్లింపు
— డీడీలు చెల్లించి సంవత్సరం గడుస్తున్న పట్టించుకోని ఏఈ, డిఈ
— వీరి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయేది
— ఈ ఘటనపై విద్యుత్ అధికారులు స్పందిస్తారా లేదా
— అయ్యవారిపల్లి గ్రామాన్ని జిల్లాకి ఆదర్శంగా తీర్చాలన్నది ఆయన కళ

కామారెడ్డి (ఆర్ సి) ఫిబ్రవరి 27 బిక్కనూరు (ప్రజా జ్యోతి)

  1. నూతన పాలకవర్గం ఏర్పడ్డ రోజు నుండి గ్రామానికి, వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ… గ్రామాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ గ్రామానికి సేవలు అందిస్తున్న జాల సత్యం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ జాల సత్యం గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గ్రామంలోనీ వ్యవసాయ భావుల వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో… కొంతమంది వ్యక్తులతో కలిసి విద్యుత్ సమస్యను పరిష్కరించే క్రమంలో, వెంట వచ్చిన వారు వెళ్లిపోగా జాల సత్యం ఒక్కడే సమస్యను పరిష్కరిద్దామని ప్రయత్నిస్తున్న క్రమంలో వైరు కలిగి విద్యుత్ ఘాతం జరిగింది. విద్యుత్ ఘాతంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సర్పంచ్ కాసేపటికి తేరుకొని గ్రామస్తులకు తెలియచేయగా వెంటనే వారు అత్యవసర చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెడికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనను గురించి “ప్రజా జ్యోతి” పత్రిక విలేఖరికి ఫోను ద్వారా సమాచారం అందించాడు. గత సంవత్సరంలోనే వ్యవసాయ భావులకు, గ్రామానికి వేరువేరు ట్రాన్స్ఫార్మర్లను బిగించాలని డీడీలు చెల్లించామని, అయినప్పటికీ ఏ ఈ, డి ఈ లు స్పందించకపోవడంతో, ఇలాంటి ఘటన చోటు చేసుకుందని వాపోయాడు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశాడు. కొంతమంది గ్రామస్తులు మాట్లాడుతూ… సర్పంచిగా ఎన్నికైన నాటినుండి తన సొంత డబ్బుతో గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నాడని, అందులో భాగంగా 9 మందికి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నాడని, నూతనంగా వివాహం చేసుకున్న వారికి తులం నర వెండితో పాటు 50 కిలోల బియ్యాన్ని ఇస్తూ, మరణించిన వారికి తన వంతు సహాయంగా 2500 అందిస్తున్న మనసున్న నేతకు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించాలని వారు కోరారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *