ఆపరేషన్ సిందూర్ 2.0′ ఊహలకు అందనంత భయంకరంగా ఉంటుంది: భారత సైనికాధికారి

V. Sai Krishna Reddy
1 Min Read

సరిహద్దుల్లో పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంపై భారత సైన్యం తీవ్రస్థాయిలో మండిపడింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కంటే ఈసారి ప్రతిస్పందన మరింత భీకరంగా ఉంటుందని వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. ఊహలకు అందనంత భయంకరంగా ఉంటుందని అన్నారు. గతంలో భారత క్షిపణులు పాక్ వైమానిక స్థావరాలను, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాక్ సైన్యం కాల్పుల విరమణ కోసం భారత కాళ్లపై పడిందని ఆయన గుర్తుచేశారు.

నేరుగా యుద్ధం చేసే ధైర్యం లేక ప్రాక్సీల ద్వారా ముసుగు దాడులకు పాకిస్థాన్ పాల్పడుతోందని, ఆ దేశం ఒక దుర్భరమైన, బలహీనమైన స్థితిలో ఉందని కటియార్ విశ్లేషించారు. పరిస్థితిని బట్టి తాము ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడబోమని, గతంలో చేసిన దానికంటే ఈసారి దెబ్బ తీవ్రత మరింత బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ తన తీరు మార్చుకోకపోతే, మరోసారి విధ్వంసాన్ని చవిచూడక తప్పదని వ్యాఖ్యానించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *