విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఇదేనా..?.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!

V. Sai Krishna Reddy
1 Min Read

టాలీవుడ్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించినదంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వైరల్ కార్డు ప్రకారం, విజయ్-రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగనున్నట్లు ఉంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని అందులో రాసి ఉంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ‘‘మా కుటుంబాల ఆశీస్సులతో ఫిబ్రవరి 26న ఒక చిన్న వేడుకలో రష్మిక, నేను ఒక్కటవుతున్నాం. మా ఈ కొత్త ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలి’’ అని ఆ కార్డులో రాసి ఉంది. అయితే, ఈ వెడ్డింగ్ కార్డు నిజమైనదేనా లేక ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా అనే దానిపై స్పష్టత లేదు.

గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో సూపర్ హిట్ జోడీగా పేరుపొందిన వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే విజయ్ గానీ, రష్మిక గానీ తమ రిలేషన్‌షిప్‌పై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియాలో ప్రశంసించుకోవడం, తరచూ కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. కొంతకాలం కిందట నిశ్చితార్థం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి.

ఇటీవల వీరిద్దరూ ఒకే సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వేర్వేరుగా కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పెళ్లి కార్డు వైరల్ అవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై ఈ జంట స్పందించే వరకు వేచి చూడాల్సిందే

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *