సూపర్ స్టార్ మహేశ్ బాబు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ ఆసక్తికరమైన కొత్త సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నాగబంధం’ పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.
‘ది వరల్డ్ ఆఫ్ నాగబంధం’ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. త్వరలో దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
విడుదలైన టీజర్‌ను బట్టి ఇది భారతీయ పురాణాలు, చరిత్ర నేపథ్యంతో కూడిన భారీ యాక్షన్ ఎపిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంభాషణలు లేకుండా కేవలం విజువల్స్‌తోనే కథను చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటోంది. భారీ యుద్ధ సన్నివేశాలు, రహస్యమైన పాత్రలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా నటుడు విరాట్ కర్ణ విభిన్న రూపాల్లో ఇంటెన్స్‌గా కనిపించారు.
మహాశివరాత్రి రోజున ఈ మైథలాజికల్ యాక్షన్ టీజర్‌ను విడుదల చేయడం, దానికి మహేశ్ బాబు ప్రశంసలు తోడవడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది
